ఓటు వజ్రాయుధం

ABN , First Publish Date - 2023-01-25T23:14:28+05:30 IST

ప్రజలకు ఓటు వజ్రాయుధమని, దానిని సద్విని యోగం చేసుకుని సరైన ప్రభుత్వం ఏర్పాటు చేసు కోవచ్చని వక్తలు వ్యాఖ్యానించారు.

ఓటు వజ్రాయుధం
రైల్వేకోడూరులో సీనియర్‌ ఓటర్లను సన్మానించిన అధికారులు

ఘనంగా 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం

సీనియర్‌ ఓటర్లకు సత్కారం

ప్రజలకు ఓటు వజ్రాయుధమని, దానిని సద్విని యోగం చేసుకుని సరైన ప్రభుత్వం ఏర్పాటు చేసు కోవచ్చని వక్తలు వ్యాఖ్యానించారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సీని యర్‌ ఓటర్లను ఘనంగా సత్కరించారు. ఓటరు నమోదుపై యువతలో అవగాహన కల్పిస్తూ వారి లో చైతన్యం తెచ్చేందుకే అధికారులు ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వివరాల్లోకెళితే.....

రైల్వేకోడూరు, జనవరి 25: ఓటు వజ్రాయుధమని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె. భాస్కర్‌, రైల్వేకోడూరు తహసీల్దార్‌ బి. రామమోహన్‌ తెలిపారు. బుధవా రం రైల్వేకోడూరులో 13వ జాతీయ ఓటర్ల దినోత్స వంలో భాగంగా సీనియర్‌ ఓటర్లను ఘనంగా సన్మానించారు. ఓటు తోనే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఉంటుందన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ అమరేశ్వరి, ఎన్నికల సీనియర్‌ అసి స్టెంట్‌ శివనాగిరెడ్డి, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.

నందలూరులో....

నందలూరు, జనవరి25: అరవపల్లె ప్రాధమిక పాఠశాలలోని 95వ పోలింగ్‌ బూత్‌ వద్ద వీఆర్వో చంద్రశేఖర్‌రాజు ఆధ్వర్యంలో సీనియర్‌ ఓటర్లు వెంకటలక్షుమ్మ, అల్లాబక్ష్‌ను సన్మానించారు. తహసీల్దార్‌ ఉ దయ శంకర్‌రాజు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీనియ ర్‌ సిటిజన్స్‌ను సన్మానించారు. ఏసీబీ ఎస్‌ఐ ఖాసీంపీరా, బూత్‌ లెవల్‌ అధికారులు చంద్రబాబు, సం యుక్త, మౌనిక, వలంటీర్లు మధు, శివకోటి, కమాల్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

రామాపురంలో....

రామాపురం, జనవరి25: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదవాలని తహసీల్దార్‌ సత్యానందం సూచించారు. మండలంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద ర్యాలీ నిర్వహించారు. ఆయా పోలింగ్‌ కేం ద్రాల వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిం చి విజేతలకు బహుమతులు ఇచ్చామన్నారు. కొత్త ఓటర్‌ నమోదు కోసం ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధి గ్రామాల్లో బూత్‌ లెవెల్‌ అధికారులను ఏర్పా టు చేశామన్నారు. సీనియర్‌ ఓటర్లను ఘనంగా సన్మానించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ అరవిందకిశోర్‌, ఆర్‌ఐ శివశంకర్‌, వీఆర్‌ఓ, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

చిట్వేలిలో....

చిట్వేలి, జనవరి25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కువజ్రాయుధమని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని తహసీల్దారు మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ మహేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి అధ్యక్షతన జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపసర్పంచ్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి, తహసీల్దారు మురళీకృష్ణ సీనియర్‌ సిటిజన్లను సత్కరించి విద్యార్థులతో కలిసి ఓటుహక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శేషంరాజు, వీఆర్వో నరసింహులు, ఉపాధ్యాయులు డేవిడ్‌ ప్రసాద్‌, పంచాయతీ సిబ్బంది మణి, విద్యార్థులు పాల్గొన్నారు.

పుల్లంపేటలో....

పుల్లంపేట, జనవరి25: మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎంపీపీ ముద్దా బా బుల్‌రెడ్డి అధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయం అధికారులు తహసీల్దారు కార్యాలయం నుంచి బైపాస్‌ వరకు ర్యాలీ చేపట్టి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు. తహసీల్దారు నరసింహకుమార్‌ మాట్లాడా రు. ఎంపీడీఓ ప్రకాశం, ఏఓ ఖాన్‌ పాల్గొన్నారు.

సంబేపల్లెలో....

సంబేపల్లె, జనవరి25: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ సమావేశంలో తహసీల్దార్‌ మహేశ్వరిభాయి మాట్లాడుతూ దేశ పౌరులుగా చెప్పుకోవడానికి ప్రథమ గుర్తింపు కార్డు ఓటరు కార్డు అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేసి ఆదర్శంగా ఉండాలన్నారు. క్రమం తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొంటున్న సీనియర్‌ ఓటర్లు కొప్పుల రామయ్య, కొండేటి సుబ్బయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మడితాటి నరసింహారెడ్డి, సర్పంచ్‌ రామచంద్ర, పంచాయతీ సెక్రటరీ రవీంద్రనాధ్‌, వీఆర్‌ఓ తదితరులు పాల్గొన్నారు.

వీరబల్లిలో....

వీరబల్లి, జనవరి25: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వీరబల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరిం చుకుని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-1, ఎన్‌ఎస్‌ఎస్‌ యూ నిట్‌-2 ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరి గింది. ప్రభుత్వ జూనియర్‌ కళశాల నుంచి వీరబల్లి బస్టాండు వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి మానవహారంగా ఏర్పడి విద్యార్థినీ, విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపాల్‌ రఘురామయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనదన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌-1 యూనిట్‌ ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌ భాస్కర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-2 ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌ రఘునారాయణరెడ్డి, లెక్చరర్స్‌, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:14:29+05:30 IST