‘ఫిష్‌ ఆంధ్ర’పై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2023-01-24T23:54:29+05:30 IST

ఫిష్‌ ఆం ధ్ర డొమెస్టిక్‌ మార్కెటింగ్‌ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.

‘ఫిష్‌ ఆంధ్ర’పై అవగాహన అవసరం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు

జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు

కడప(కలెక్టరేట్‌) జనవరి 24: ఫిష్‌ ఆం ధ్ర డొమెస్టిక్‌ మార్కెటింగ్‌ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ తన ఛాంబరులో ప్రధాన మంత్రిమత్స్య సంపద యోజన (పీఎంఎంఎ్‌సవై) పథకంలోని ఫిష్‌ ఆం ధ్ర డొమెస్టిక్‌ మార్కెటింగ్‌ పథకాల అ మలుపై సమన్వయ సమీక్షలో ఆయన మాట్లాడుతూ చేపల డొమెస్టిక్‌ మార్కెటింగ్‌ పథకాలను త్వరిత గతిన అమలు చెయ్యాలన్నారు. శాఖల వారీ నిర్ధేశించిన లక్ష్యాల కంటే లబ్ధిదారుల ఎంపికలు అధికంగా ఉండాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ముగి సే లోగా పక్రియ అమలు చేయాలనీ మత్స్య శాఖతో పాటు డీఆర్‌డీఏ మెప్మా అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల వాటా చెల్లింపుల్లో బ్యాంకులు చొరవ చూపాలన్నారు. ఈ పథకం విస్తృతంగా జిల్లా లోని గ్రామ స్థాయి నుంచి అమలు జరిగేలా ప్రచారాన్ని జడ్పీ అధికారులను ఆదేశించారు.

ఫిష్‌ ఆంధ్ర లోని మినీ దుకాణాలు రూ.10 లక్షల విలువైన ఫిష్‌ కియోస్క్‌ విలువ ఆధారిత యూనిట్లు, రూ. 20 లక్షల విలువైన వ్యాపార యూనిట్లు, రూ.50 లక్షల విలువైన వ్యాపార యూనిట్లు మాత్రమే కాకుండా సం చార చేపల విక్రయ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల అబ్ధిదారుల గుర్తింపు నెలాఖరు లోగా పూర్తి చేయాలన్నా రు. పోష కాహార విలువలున్న చేపలను అంతా వినియోగించుకు నేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో శిక్షణా కలెక్టర్‌ రాహుల్‌ మీనా, జడ్పీ సిఈఓ సుధాకర్‌ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఆనందనాయక్‌, జిల్లా మత్స్య శాఖాధికారి కె.ఎ్‌స.వి నాగలింగా చార్యులు, అడిషనల్‌ ప్రాజె క్టు డైరెక్టర్‌, మెఫ్మా,పంచాయితీ, లీడ్‌ బ్యాంకు మేనేజరు దుర్గా ప్రసాదు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:54:31+05:30 IST