డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలకు నేడు సర్టిఫికెట్ల పరిశీలన

ABN , First Publish Date - 2023-02-06T23:42:36+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య పథకం వైఎస్సార్‌ అర్బన క్లీనిక్‌లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు మంగళవారం ఉదయం 10-30 గంటలకు అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఎంహెచవో డాక్టర్‌ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలకు నేడు సర్టిఫికెట్ల పరిశీలన

కడప(కలెక్టరేట్‌) పిబ్రవరి 6 : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య పథకం వైఎస్సార్‌ అర్బన క్లీనిక్‌లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు మంగళవారం ఉదయం 10-30 గంటలకు అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఎంహెచవో డాక్టర్‌ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌ జాబితాను కడప.ఏపీ.జీవోవి.ఇన వెబ్‌సైట్‌లో 1-3 పద్ధతిలో ఉంచామని తెలిపా రు. ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. అలాగే గత ఏడాది స్టాఫ్‌ నర్సుల భర్తీ నోటిఫికేషన మేరకు ఫైనల్‌ మెరిట్‌ జాబితాను కడప.ఏపీ.జీవోవి.ఇన వెబ్‌సైట్‌లో ఉంచామని, ఎంపికైన అభ్యర్థులు 8వ తేదీ బుధవారం ఉదయం 10-30 గంటలకు డీఎంహెచఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఎంహెచఓ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T23:42:39+05:30 IST