తోళ్లగంగనపల్లెలో ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి..

ABN , First Publish Date - 2023-01-24T23:25:03+05:30 IST

టీడీపీ ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని తోళ్లగంగనపల్లెలో వల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి కార్యక్రమాన్ని నిర్వహించారు.

తోళ్లగంగనపల్లెలో ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి..
ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి పోస్టరును ప్రజలకు చూపిస్తున్న టీడీపీ నాయకులు

వల్లూరు, జనవరి 24 : టీడీపీ ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని తోళ్లగంగనపల్లెలో వల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలను వివరించారు. స్థానిక నాయకులు శివ కేశవరెడ్డి, దస్తగిరి, వెంకటసుబ్బయ్య, చౌడయ్య, పుల్లయ్య, రామసుబ్బయ్య, వలీసాహెబ్‌, ఎస్సీ సెల్‌ పుల్లగూర శ్రీనివాసులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:25:03+05:30 IST