గడ్డి మందు కొట్టి వరికి నష్టం కలిగించారు

ABN , First Publish Date - 2023-01-24T23:50:21+05:30 IST

మండలంలోని రామనపల్లె పొలంలో దాదాపు 4.85 ఎకరాల్లో సాగు చేసిన వరిలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు కొట్టి పంట మొత్తం ఎండిపోయేటట్లుగా చేశారని చిన్నమాచుపల్లెవాసి ఉమామహేశ్వర్‌రెడ్డి మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

గడ్డి మందు కొట్టి వరికి నష్టం కలిగించారు

- ఎస్పీకి చిన్నమాచుపల్లె రైతు ఫిర్యాదు

చెన్నూరు, జనవరి 24: మండలంలోని రామనపల్లె పొలంలో దాదాపు 4.85 ఎకరాల్లో సాగు చేసిన వరిలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు కొట్టి పంట మొత్తం ఎండిపోయేటట్లుగా చేశారని చిన్నమాచుపల్లెవాసి ఉమామహేశ్వర్‌రెడ్డి మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉమామహేశ్వర్‌రెడ్డి రామనపల్లె రెవెన్యూ పొలంలో 4.85 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వరి నాటిన నెలరోజుల తరువాత వరిపై ఇటీ వల అర్ధరాత్రి ఎవరో గడ్డి మందు కొట్టారని, దీంతో నాలుగు ఎకరాల మేర పంట కాలిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 17న ఈ సంఘటన జరిగిందన్నారు. కడప నగ రంలోని గౌస్‌నగర్‌కు చెందిన నూర్‌బాష అనే వ్యక్తి ఈ పని చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-01-24T23:50:21+05:30 IST