ఉక్కు ప్రైవేటీ కరణ ఆలోచనను విరమించుకోవాలి

ABN , First Publish Date - 2023-01-24T23:39:24+05:30 IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచనను బీజేపీ విరమించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఉక్కు ప్రైవేటీ కరణ ఆలోచనను విరమించుకోవాలి
బద్వేలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దృశ్యం

బద్వేలు, జనవరి24: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచనను బీజేపీ విరమించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా బద్వేలు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఎదుట సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీలు కార్మికులు, నిర్వాసితులు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. విశాఖను ప్రైవేటీకరణ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు పేర్కొన్నారు. అనంతరం ఆర్డీవో ఆకుల వెంకటరమణకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలొ సీపీఐ జిల్లా కార్యవర్గ సబ్యుడు వీరశేఖర్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మస్తాన్‌, సీఐటీయూ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, పి.వి.రమణ, సీపీఐ పట్టణ కార్యదర్శి బాలు, లక్షుమ్మ , షాహిదా తదితరులు పాల్గొన్నారు.

సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి..: సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం డీవైఎ్‌ఫఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ నాయకులు మస్తాన్‌, షరీఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

జమ్మలమడుగు..: కేంద్ర ప్రభుత్వం ఆదానీకి దాసోహంగా వ్యవహరిస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంవీ సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సుబ్బరాయుడు విమర్శించారు. మంగళవారం జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదంటూ సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి చాంద్‌బాష, ఇన్సాఫ్‌, జిల్లా అధ్యక్షుడు షరీఫ్‌, సీపీఐ కార్యదర్శి ప్రసాద్‌, సహాయ కార ్యదర్శి లోకేశ్‌, కొండాపురం రైతు సంఘం నాయకుడు సుదర్శన్‌రెడ్డి, సీపీఐ నాయకులు దండు రవి, గోపాల్‌, రమేష్‌, మారయ్య, నాగరాజు, మహిళా సంఘం నాయకులు ప్రమీళా, సుజాత, దస్తగిరమ్మ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ, ఎఐటీయూసీ నాయకులు

Updated Date - 2023-01-24T23:39:43+05:30 IST