జగన్‌ పాలనలో రాష్ట్రం దివాళా!

ABN , First Publish Date - 2023-02-06T23:06:54+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అసమర్థపాలనలో రాష్ట్రం దివాలా తీసిందని మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ విమర్శించారు.

జగన్‌ పాలనలో రాష్ట్రం దివాళా!
మహిళలతో మాట్లాడుతున్న సుధాకర్‌యాదవ్‌

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’లో పుట్టా సుధాకర్‌యాదవ్‌

చాపాడు, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అసమర్థపాలనలో రాష్ట్రం దివాలా తీసిందని మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ విమర్శించారు. పుల్లారెడ్డినగర్‌, భద్రిపల్లె దళితవాడల్లో సోమవారం సాయంత్రం ఆయన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్‌ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలకు వివరించారు. ఆయన హయాంలోనిత్యావసరాలు, ఇంటి పన్నులు తదితరాలు విపరీతంగా పెరిగాయని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర ్పడిందన్నారు. ఇసుక, మట్టిని వైసీపీ నాయకులు భారీగా దోచేస్తున్నారని విమర్శించారు. మద్య నిషేధాన్ని అమలు చేయకుండా జగన్‌ మోసం చేశాడన్నారు. రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను తన కార్యకర్తలకు కట్టబెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడన్నారు. చట్టవిరుద్ధంగా వైసీపీ కార్యకర్తలకు భూములు కట్టబెడితే అడ్డుకుంటామన్నారు. 175 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తానని ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నాడని విమర్శించారు. మండలంలోని నంద్యాలంపేట వద్ద ఒక దళిత కుటుంబానికి చెందిన భూమిలో వైసీపీ నాయకులు దౌర్జన్యంగా మామిడి చెట్లు తొలగించి ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్‌ గుత్తి మల్లేశ్వరి, మండల టీడీపీ అధ్యక్షుడు అన్నవరం సుధాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు నారపురెడ్డి, రవిశంకర్‌రెడ్డి, సూర్యనారాయణ, సుదర్శన్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, మేకల బాబు, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:06:56+05:30 IST