చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు

ABN , First Publish Date - 2023-02-01T23:16:46+05:30 IST

చిరు ధాన్యాల వాడకం ఆరోగ్యానికి ఎంతో మేలని వ్యవసాయ సహాయ సంచాలకుడు డాక్టర్‌ నాగరాజు తెలిపారు.

చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు

బద్వేలు, ఫిబ్రవరి 1: చిరు ధాన్యాల వాడకం ఆరోగ్యానికి ఎంతో మేలని వ్యవసాయ సహాయ సంచాలకుడు డాక్టర్‌ నాగరాజు తెలిపారు. 2023వ సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా పరిగణించడంతో బుధవారం గోపవరం మండలంలోని బేతాయపల్లె పంచాయతీలోని నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చిరుధాన్యాలను ఆహారంలో ప్రతిరోజు భాగంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హరినారాయణ, ఏవో అరవింద నాయక్‌, సర్పంచ్‌ వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:17:06+05:30 IST