ఎస్సీ, ఎస్టీ పథకాలను కొనసాగించాలి

ABN , First Publish Date - 2023-02-06T23:56:46+05:30 IST

దళిత బలహీన వర్గాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన 27 సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని మాలమహానాడు జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ యనమల సుదర్శన్‌ అన్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

ఎస్సీ, ఎస్టీ పథకాలను కొనసాగించాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మాలమహానాడు నాయకులు

మాలమహానాడు జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

రాయచోటి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6: దళిత బలహీన వర్గాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన 27 సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని మాలమహానాడు జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ యనమల సుదర్శన్‌ అన్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు ఒక్కలోను కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగి దళిత వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగం సంజీవ్‌, రాష్ట్ర కార్యదర్శి వీరభద్రయ్య, రాయలసీమ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రయ్య, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌, జిల్లా అధికార ప్రతినిధి మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:56:48+05:30 IST