యువకుడి దారుణహత్య

ABN , First Publish Date - 2023-02-01T23:36:32+05:30 IST

కడప నగరం ఎస్‌ఆర్‌ ఽథియేటర్‌ సమీపంలోని ఓ బార్‌లో బుధవారం రాత్రి ఓ యువకున్ని దారుణంగా హత్య చేశా రు.

యువకుడి దారుణహత్య

మరో యువకుడికి తీవ్ర గాయాలు

పాతకక్షలా..లేక లావాదేవీలే కారణమా!

మృతదేహాన్ని పరిశీలించిన కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి

కడప (క్రైం), ఫిబ్రవరి 1: కడప నగరం ఎస్‌ఆర్‌ ఽథియేటర్‌ సమీపంలోని ఓ బార్‌లో బుధవారం రాత్రి ఓ యువకున్ని దారుణంగా హత్య చేశా రు. మృతుని స్నేహితుడికి తీవ్రగాయాల య్యా యి. హత్యకు గల కారణాలు పాతకక్షలా? లేక ఏవైనా లావాదేవీలా, మరేమైనా ఇతర కారణా లు ఉన్నాయా అనే కోణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి, వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ పెద్ద ఓబన్న, కమాండ్‌ కంట్రోల్‌ సీఐ వెంకటేశ్వర్లు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులు, పోలీసుల ప్రాఽథమిక సమాచారం మేరకు... కడప నగరం రాజారెడ్డివీధికి చెందిన పేట నాగరాజుకు ఇద్దరు కుమారుల్లో రెండోవాడైన పేట రేవంత్‌ తన స్నేహితుడైన సియోన్‌పురం వాసి అభిలా్‌షతో కలిసి బుధవారం రాత్రి బార్‌కు వెళ్లారు. కొందరు దుండగులు అక్కడికి చేరుకు ని రాళ్లతో దాడి చేసి కత్తులతో పొడవడంతో రేవంత్‌ పొట్టలోని పేగులు బయటికి వచ్చి తల పగిలిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం పొం దాడు. అభిలా్‌షకు కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రేవంత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌ మార్చురీకి తరలించారు. కాగా హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

సీసీ ఫుటేజీ పరిశీలన

రేవంత్‌ హత్య జరిగిన సంఘటనపై పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎవరెవరు, ఎంత మంది వచ్చారు, హత్య చేసి ఎలా పారిపోయారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే నగర నడిబొడ్డులో హత్య జరగడం కలకలం సృష్టించింది.

Updated Date - 2023-02-01T23:36:36+05:30 IST