బాలికపై లైంగికదాడి

ABN , First Publish Date - 2023-02-01T23:32:50+05:30 IST

జమ్మలమడుగు మండలంలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఓ గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు.

బాలికపై లైంగికదాడి

ఇద్దరిపై కేసు నమోదు

జమ్మలమడుగు, జనవరి 1: జమ్మలమడుగు మండలంలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఓ గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు... బాలిక తల్లిదండ్రుల మధ్య మన స్పర్థల కారణంగా విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. వీరు స్థానికంగా కూడా నివాసం లేరు. దీంతో బాలిక తన అమ్మమ్మ దగ్గర ఉంటూ గ్రామంలోని ఓ దుకాణంలో పనిచేసేది. ఈ నేపథ్యంలో బాలికకు వరుసకు మామ అయిన అదే గ్రామానికి చెందిన సుబ్బరాయుడు (35)తో పాటు వెంకటసుబ్బయ్య (50) అనే వ్యక్తి వేర్వేరుగా అప్పుడప్పుడు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వాళ్లు బాలిక తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో బాలిక తండ్రి తన కుమార్తెతో కలిసి జమ్మలమడుగు అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనకు సంబందించి డీఎస్పీ నాగరాజు సమగ్ర విచారణ చేస్తున్నారని అర్బన సీఐ సదాశివయ్య తెలిపారు.

Updated Date - 2023-02-01T23:32:54+05:30 IST