చుక్కల భూములపై నివేదికలివ్వండి

ABN , First Publish Date - 2023-02-06T23:22:41+05:30 IST

గ్రామాల్లో 22ఏ కింద వున్న చుక్కల భూములను (డాటెడ్‌ ల్యాండ్స్‌) గుర్తించి వాటిపై నివేదికలు ఇవ్వాలని ఆర్డీవో మురళి ఆదేశించారు.

చుక్కల భూములపై నివేదికలివ్వండి
సబ్‌కలెక్టరేట్‌లో తహసీల్దార్‌లతో సమీక్షిస్తున్న ఆర్డీవో మురళి

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 6: గ్రామాల్లో 22ఏ కింద వున్న చుక్కల భూములను (డాటెడ్‌ ల్యాండ్స్‌) గుర్తించి వాటిపై నివేదికలు ఇవ్వాలని ఆర్డీవో మురళి ఆదేశించారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో డివిజ నలోని అన్ని మండలాల తహసీల్దార్లతో 15 రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఖాళీగా వున్న డాటెడ్‌ ల్యాండ్స్‌ను అసైనమెంట్‌ చేయకుండా ఆర్‌హెచ పేజీలో పట్టాదారుల పేరుమీద ఉన్న వాటిని గుర్తించాలన్నారు. హౌసిం గ్‌ పథకం, పీవోఎల్‌ఆర్‌, భూమి కన్వర్షనలపై దృష్టి పెట్టాలన్నారు. చాలా మంది ఓటీఎస్‌ల కోసం దరఖాస్తు చేసుకుని రికార్డులు సక్రమంగా పెట్టకపోవడం గుర్తించామన్నారు. ఎనహెచ 42లో ఆరు గ్రామాల్లో భూసేకరణపై సమీక్షించామన్నారు. స్పందనలో వచ్చిన అర్జీలపై వారం లోపు రిపోర్టులు పంపాలన్నారు. చాలాచోట్ల ప్రజలు భూ సమస్యలపై అర్జీలు ఇస్తున్నారే కాని, సరైన రికార్డులు సమర్పించడం లేదన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తహసీల్దార్‌లకు సూచించా రు. సమావేశంలో డీఏవో శేషయ్య, 11 మంది తహసీల్దార్లు పాల్గొన్నారు.

భూముల రీసర్వేలో తప్పులను సరిదిద్దండి సార్‌..!

భూముల రీసర్వేలో తప్పులు దొర్లుతున్నాయని, ఒకరి పేరుతో భూమి ఉంటే వేరొకరి పేరుతో ఆనలైనలో చూపుతున్నాయని వాటిని సరిదిద్దాలని పలువురు రైతులు ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. సోమవా రం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో ఆర్డీవో మురళి ఆధ్వర్యంలో స్పందన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లె మండలం టీచర్స్‌ కాలనీకి చెందిన రైతులు మాట్లాడుతూ తాము ఇతరుల నుంచి భూమి కొనుగోలు చేసి పదేళ్లు అవుతోందని, కానీ రీసర్వే తరువాత ప్రస్తుతం తాము కొనుగోలు చేసిన వ్యక్తి పేరే ఆనలైనలో చూపుతోందని ఆర్డీవోకు వివరించారు. మండలంలోని ఓబులనాయుని చెరువు వద్ద కొందరు ఆక్రమించుకుని తమ పొలాలకు వెళ్లే దారికి అడ్డుతగులుతున్నారని పెం చుపాడు రైతులు ఫిర్యాదు చేశారు. రామసముద్రం మండలం ఊల పాడు పంచాయతీలో శ్మశానానికి వెళ్లే దారిని ఆక్రమించుకున్నారని, ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు ఆర్డీవోకు విన్నవించారు. హౌసింగ్‌ పథకంలో ఇంటి నంబరు, ఆధార్‌ నంబరు తప్పుగా పడటంతో బిల్లులు రావడం లేదని నిమ్మనపల్లె పంచాయతీ మంగళవీధికి చెందిన జయమ్మ విన్నవించింది. మొత్తం 45 మంది వివిధ సమస్యలతో ఆర్డీవోకు అర్జీలు సమర్పించారు.

Updated Date - 2023-02-06T23:22:43+05:30 IST