ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి

ABN , First Publish Date - 2023-02-06T23:25:50+05:30 IST

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పారిశ్రామికవేత్త అదాని తీసు కున్న రుణాలు తిరిగి చెల్లిం చేలా చేసి వాటిని కాపాడాలని ఎనఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్య క్షుడు మద్దెల అమృతతేజ కేం ద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు.

ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి
పీలేరులో నిరసన తెలియజేస్తున్న ఎనఎస్‌యూఐ శ్రేణులు

పీలేరు, ఫిబ్రవరి 6: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పారిశ్రామికవేత్త అదాని తీసు కున్న రుణాలు తిరిగి చెల్లిం చేలా చేసి వాటిని కాపాడాలని ఎనఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్య క్షుడు మద్దెల అమృతతేజ కేం ద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేర కు ఆదాని మోసాలను నిరసిస్తూ ఎనఎస్‌యూఐ శ్రేణులు సోమవారం స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ఐసీ శాఖల ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అమృతతేజ మాట్లాడుతూ అదానీ గ్రూపు సంస్థల్లో ఎల్‌ఐసీ పెట్టిన రూ.36 వేల కోట్లు, దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణా లు రూ.80 వేల కోట్లు నష్టపోయాయన్నారు. అదానీపై హిడెనబర్గ్‌ నివేదిక ఆధారంగా జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేసి సుప్రీంకోర్టు ధర్మాసనంతో విచారణ చేయించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎనఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సంపత, నాయకులు హేమంత, మహేశ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:25:51+05:30 IST