రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

ABN , First Publish Date - 2023-01-25T23:31:51+05:30 IST

రిపబ్లిక్‌డేను పురస్కరించుకుని కడప రైల్వేస్టేషన్‌లో పలు చోట్ల ఆర్పీఎఫ్‌ పోలీసులు బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టా రు.

రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

కడప (ఎర్రముక్కపల్లె), జనవరి 25: రిపబ్లిక్‌డేను పురస్కరించుకుని కడప రైల్వేస్టేషన్‌లో పలు చోట్ల ఆర్పీఎఫ్‌ పోలీసులు బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టా రు. ప్రధానంగా రైల్వే పార్శిల్‌ కార్యాల యం, బుకింగ్‌ ఆఫీసు, వెయిటింగ్‌ హాలు, ప్లాట్‌ఫారం, గూడ్సు షెడ్డు, రైళ్లలో ప్రయాణికుల బ్యాగులను తనిఖీలు చేశారు. ఆర్‌పీఎఫ్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యం లో ఈ ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ రిపబ్లిక్‌ డే పురస్కరించుకుని కడప రైల్వేస్టేషన్‌లో ఎటువంటి అసాంఘిక ఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలు నిర్వహించామన్నారు.

Updated Date - 2023-01-25T23:31:51+05:30 IST