రీసర్వేను పరిశీలించిన అధికారులు

ABN , First Publish Date - 2023-02-01T23:46:22+05:30 IST

స్థానిక రెవెన్యూ కార్యాల య సమీపంలోని పాఠశాల మైదానంలో శుక్రవారం రీ సర్వే తీరును రెవెన్యూ అధి కారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

రీసర్వేను పరిశీలించిన అధికారులు
డ్రోన పనితీరును పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

పెద్దతిప్పసముద్రం ఫిబ్రవరి 1: స్థానిక రెవెన్యూ కార్యాల య సమీపంలోని పాఠశాల మైదానంలో శుక్రవారం రీ సర్వే తీరును రెవెన్యూ అధి కారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ సందర్భం గా తహసీల్దార్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ రైతులు తమ వద్ద ఉన్న హక్కు పత్రాలను చూపించి, భూములకు సంబంధించిన సమస్యలను నమోదు చేసుకోవాలని తెలిపారు. వందేళ్ల తరువాత రీ సర్వే జరుగుతుండడంతో రైతులు సర్వే బృందానికి సహకరించాలని తెలియజే శారు. డ్రోన పనితీరును డిప్యూటీ ఇనస్పెక్టర్‌ మునికణ్నన తనిఖీ చేశారు. రెవెన్యూ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మండలంలోని జగడం వారిపల్లెకు చెందిన రీసర్వే వివరాలను, డ్రోన పనితీరును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్‌ మహ్మద్‌ రఫీ, రీసర్వే డీటీ. ధనంజ యులు, ఆర్‌ఐ అనీషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:46:26+05:30 IST