రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రోత్సాహకాలు

ABN , First Publish Date - 2023-02-01T23:43:45+05:30 IST

ఉద్యాన శాఖ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రత్యేక ప్రోత్సాహ కాలు అందిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర తెలిపారు.

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రోత్సాహకాలు
రైతులతో మాట్లాడుతున్న డీహెచవో రవిచంద్ర

జిల్లా ఉద్యాన అధికారి రవిచంద్ర

పీలేరు, ఫిబ్రవరి 1: ఉద్యాన శాఖ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రత్యేక ప్రోత్సాహ కాలు అందిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర తెలిపారు. ఎఫ్‌పీవోల నిర్మాణ అవగాహన సదస్సుల నిర్వహణలో భాగంగా బుధవారం ఆయన పీలేరు, కేవీపల్లె మండలాల్లో పర్యటించారు. సొరకాయలపేటలో కరువు సంసిద్ధత పథకం కింద గతంలో ఏర్పాటైన రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులు, పీలేరు మండలం తలపులలో ప్రస్తుతం పని చేస్తున్న ఉత్పిత్తిదారుల సంఘ సభ్యులు, ఆసక్తి గల ఇతర రైతులతో చర్చించారు. ప్రస్తుతం విజయవంతంగా పనిచేస్తున్న ఉత్పత్తిదారుల సంఘ ఆధ్వర్యంలో నూతన కలెక్షన సెంటర్‌ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్న ట్లు తెలిపారు. ఒక్కో కలెక్షన సెంటర్‌ నిర్మాణా నికి రూ.15 లక్షలు వ్యయం అవుతుందని, దానిలో రూ.11.25 లక్షలు సబ్సిడీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని, ఎఫ్‌పీవోలు కేవలం రూ.3.75 లక్షలు భరించుకోవాలన్నారు. కలెక్షన సెంటర్‌తోపాటు ఆసక్తి గల సంఘాలకు రూ.12.5 లక్షల వ్యయమయ్యే 10 టన్నుల సా మర్థ్యం గల కోల్డ్‌ స్టోరేజ్‌ కూడా మంజూరు చేస్తామని, ఆ మొత్తంలో కూడా 75 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. ఉత్పత్తిదారుల సంఘా లుగా ఏర్పడడం ద్వారా సంఘటితంగా వ్యవసా యం చేయడం, మార్కెట్‌ ధరలు, అవసరా లకు అనుగుణంగా పంటలు మార్చుకోవడం, సామూహికంగా ఎరువులు, పురుగుల మందు లు కొనడం, తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ వంటి చర్యలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చుననే అంశాన్ని తమ శాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. అనం తరం ఆయన కేవీపల్లె, పీలేరు మండలాల్లోని పలు ఆర్బీకేలను తనిఖీ చేశారు. ఈ కార్యక్ర మంలో ‘డ్యాబ్‌’ సభ్యుడు బోదేషావలి, పీలేరు హెచవో సుకుమార్‌ రెడ్డి, రైతులు పాల్గొన్నారు

Updated Date - 2023-02-01T23:44:31+05:30 IST