బాలికా విద్యను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2023-01-24T23:56:32+05:30 IST

బాలికల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహిం చాలని ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ ధనలక్ష్మి పేర్కొన్నారు.

బాలికా విద్యను ప్రోత్సహించాలి
వాల్మీకిపురరంలో మాట్లాడుతున్న పీడీ ధనలక్ష్మి

వాల్మీకిపురం, జనవరి 24: బాలికల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహిం చాలని ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ ధనలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళవారం వాల్మీకిపురం జడ్పీ బాలి కోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చే సి ప్రశంగించారు. క్రమశిక్షణతో చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత చేకూరుతుందన్నారు. అనంతరం బాలికలకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచఎం శ్రీదేవి, సీడీపీవో భారతి, ఏసీడీపీవో కృష్ణమంజరి, సూపర్‌వైజర్‌లు రోహిణి, శివకుమారి, జీఎంఎస్‌కేలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మదనపల్లె టౌన: బాలికలు చదువుతో పాటు క్రమశిక్షణతో ముందుకు సాగాలని సీడీపీవో సుజాత పేర్కొన్నారు. మంగళవారం జాతీయ బాలి కా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళా శాలల్లో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన సమా వేశంలో సీడీపీవో మాట్లాడుతూ బాల్య వివాహాలు నిరోధించాలని, భ్రూ ణహత్యలపై అప్రమత్తంగా వుండాలని సూచించారు. అలాగే స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. అధ్యాపకులు విష్ణుప్రియ, వనజ, ఖాజావలి, నమ్రత, సుబ్బరాయుడు, వెంకటశివ, యాస్మీన పాల్గొ న్నారు. జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బాలికా దినోత్సవంలో ప్రిన్సిపాల్‌ రమాదేవి, అధ్యాపకులు రమ్య తదితరులు బాలికలు తీసుకోవాల్సిన జాగ్రతల గురించి వివరించారు.

పీలేరులో: జాతీయ బాలికా దినోత్సవాన్ని మంగళవారం పీలేరు, కేవీ పల్లె మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్‌, వైద్య, విద్యా శాఖ ల సంయుక్త ఆధ్వర్యంలో ఆయా మండలాల్లోని పలు పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. పీలేరులోని గిరిజన బాలికల గురుకులంలో జరిగిన కార్యక్రమంలో తల పుల వైద్యాధికారి చంద్రశేఖర్‌ నాయక్‌ పాల్గొని ప్రసంగించారు. కేవీపల్లె మండలం గ్యారంపల్లె కొత్తపల్లె జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజరు సర్తాజ్‌ పిల్లలకు పౌష్టికా హార కిట్లు అందజేశారు. పీలేరు -చిత్తూరు మార్గంలోని డాక్టర్‌ బీఆర్‌అం బేడ్కర్‌ గురుకులంలో సూపర్‌వైజర్‌ స్వర్ణ పాల్గొని ప్రసంగించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో వైద్య సిబ్బంది కొండయ్య, కుసుమ, మహిళా పోలీసు గాయత్రి, ఏఎనఎం నాగరాజమ్మ, సూపర్‌వైజర్‌ స్వరూ ప, అంగనవాడీ కార్యకర్తలు భూదేవి, ధనలక్ష్మి, వసంతమ్మ పాల్గొన్నారు.

కలకడలో: స్థానిక కేజీవీబీలో మంగళవారం జాతీయ బాలికాదినోత్సవా న్ని జిల్లా ఆర్బీఎస్‌కే ప్రొగ్రామ్‌ అధికారి శేషగిరిబాబు ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లింగ వివక్షతను విడనాడాలన్నారు. అనంతరం బాలికల కోసం స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్‌ అనిత, డాక్టర్‌ మల్లికార్జున, హెచసీ మహ్మద్‌రఫీ, సిబ్బంది పాల్గొన్నారు.

ములకలచెరువులో: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మం గళవారం జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అల్తాఫ్‌బాను, ఎనఎస్‌ఎస్‌ పీవో శివరామయ్య, లెక్చరర్లు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: బాలికా విద్యను తల్లితండ్రులు ప్రోత్సహించాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శ్వేత పేర్కొన్నారు. మంగళవారం తంబళ్లపల్లె ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికా విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం పై బాలికలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యా యులు, మహిళా పోలీసులు, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

రామసముద్రంలో:స్థానిక జడ్పీస్కూల్‌, దిన్నెపల్లెసమాపంలోని కస్తూరి బా గాంధీపాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలఓ ఎంఈఓ హేమలత మాట్లాడుతూ బాలికలు అన్నిరంగాల్లో ముందుండాలని, తెలిపారు. ఐసీడీఎస్‌ అధికారిని రమా దేవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్పిపాల్‌ విజ యలక్ష్మీ, అధ్యాపకులు, విద్యార్తినులు, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: విద్యావంతులందరు బాలికలలో చైతన్యం తీసుకు రావాలని తంబళ్లపల్లి పోర్డు సేవా సంస్థ డైరెక్టర్‌ లలితమ్మ పిలుపు నిచ్చా రు. కస్తూర్భా బాలికల పాఠశాలలో మంగళవారం జాతీయ బాలిక దినో త్సవం నిర్వహించి విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమ తులు అందజేశారు. ఎస్‌వో కుమారి, మండల పోర్డు సంస్థ కోఆర్డినేటర్‌ నరసింహులు,అంగనవాడీ సూపర్‌వైజర్‌ కళావతి పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:56:32+05:30 IST