ముఖ హాజరు నుంచి మినహాయించండి

ABN , First Publish Date - 2023-02-06T23:12:10+05:30 IST

ముఖ హాజరు నుంచి తమకు మినహాయింపు నివ్వాలని కోరుతూ గ్రామ సేవకులు సోమవారం కలసపాడు తహసీల్దారుకు వినతిపత్రం అందించారు.

ముఖ హాజరు నుంచి మినహాయించండి

కలసపాడు, ఫిబ్రవరి 6 : ముఖ హాజరు నుంచి తమకు మినహాయింపు నివ్వాలని కోరుతూ గ్రామ సేవకులు సోమవారం కలసపాడు తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తాము ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ముఖ హాజరు వేయాలంటే, ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. దాంతో జీతం మొత్తం చార్జీలకు సరిపోవడంలేదన్నారు. ఈ నేపథ్యంలో ముఖహాజరును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని అధికారులను కోరుతున్నట్లు వారు తెలిపారు.

Updated Date - 2023-02-06T23:12:11+05:30 IST