6న చలో కలెక్టరేట్‌

ABN , First Publish Date - 2023-02-01T23:15:04+05:30 IST

జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలుతో పాటు నిర్మాణ సామగ్రి ఉచితంగా ఇవ్వాలని డిమాండుతో ఈనెల 6వ తేదీన చలో కలెక్టరేట్‌ చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు.

6న చలో కలెక్టరేట్‌
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర

ప్రొద్దుటూరు క్రైం, ఫిబ్రవరి 1 : జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలుతో పాటు నిర్మాణ సామగ్రి ఉచితంగా ఇవ్వాలని డిమాండుతో ఈనెల 6వ తేదీన చలో కలెక్టరేట్‌ చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. బుధవారం సాయంత్రం పెన్నానగర్‌లోని సీపీఐ కార్యాలయంలో నాయకుడు ధనిరెడ్డి శివారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ పేదలందరి ఇళ్లు అంటూ జగన్‌ సర్కార్‌ పేద కుటుంబాలను దగా చేస్తోందన్నారు. నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయిందని, దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.1లక్షా 80వేలు ఎలా సరిపోతాయన్నారు. పైగా ఇపుడు లబ్ధిదారురాలు రూ.35వేలు చెల్లిస్తేనే ఇంటి నిర్మాణం చేపడతామని లేకుంటే పట్టా వెనక్కి ఇవ్వాలంటూ వలంటీర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. చలో కలెక్టరేట్‌ పార్టీ శ్రేణులతో పాటు లబ్ధిదారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి పి.సుబ్బరాయుడు, సహాయ కార్యదర్శి షరీఫ్‌, పట్టణ నాయకులు రామకృష్ణ, హరి, శ్రీను, ఏసోబు, చంద్రశేఖర్‌, నారాయణమూర్తి, ప్రతాప్‌, ప్రమీళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:15:19+05:30 IST