కడప ఉక్కుపై కేంద్ర వైఖరి స్పష్టం చేయాలి

ABN , First Publish Date - 2023-02-06T23:08:49+05:30 IST

కడప ఉక్కును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిం దని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా, రాయ లసీమకు ప్రత్యేక ప్యాకేజీ వంటివి ఇవ్వకుండా అన్యాయం చేసిందని డీవై ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ము డియం చిన్ని, వి. శివకుమార్‌ విమర్శిం చారు.

కడప ఉక్కుపై కేంద్ర వైఖరి స్పష్టం చేయాలి
మాట్లాడుతున్న డీవైఎఫ్‌ఐ నాయకులు

బద్వేలు, ఫిబ్రవరి 6: కడప ఉక్కును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిం దని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా, రాయ లసీమకు ప్రత్యేక ప్యాకేజీ వంటివి ఇవ్వకుండా అన్యాయం చేసిందని డీవై ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ము డియం చిన్ని, వి. శివకుమార్‌ విమర్శిం చారు. సోమవారం స్థానిక కార్యాల యంలో నిర్వహించిన విలేకర్ల సమా వేశంలో వారు మాట్లాడుతూ గడిచిన పార్లమెంటు సమావేశాలలో ప్రత్యేక హోదా, కడప ఉక్కు, రాయలసీమ ప్యాకేజీ అంశాలను ప్రస్తావిస్తారని ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలకు మోసం చేశారన్నారు. ఈ మధ్య జరిగిన బడ్జెట్‌ సమావేశాలలో కూడా కడప ఉక్కుకు రూపాయి కూడా కేటాయించక పోవడం బాఽధాకరమని దీనిని బట్టే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతుందన్నారు. ఒకవైపు సీమ కరువుతో అల్లాడుతున్నా కేంద్రం దీనిని పూర్తిగా విస్మరిం చిందన్నారు. ఇప్పటికైనా అధికార, విపక్షాలు రెండూ కడప హక్కు కోసం, హోదాకోసం కేంద్రంపై గళం విప్పాల ని కోరారు. ఈ సమావేశంలో బద్వేలు డీవైఎఫ్‌ఐ పట్టణ నాయకులు మస్తాన్‌, షరీఫ్‌, రామకృష్ణ, ఇమ్మానుయేల్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:08:53+05:30 IST