ఉద్యానశాఖ పథకాలపై అవగాహనేది..?

ABN , First Publish Date - 2023-02-06T23:30:07+05:30 IST

ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అందుతు న్న పథకాలు, రుణాలపై ఉద్యాన అధికారి ఈశ్వర ప్రసాద్‌ మండల సమావేశంలో మాట్లాడుతుండగా మాలేపాడు సర్పంచు గణేష్‌, పోత బోలు సర్పంచు ఈశ్వరయ్యలు నిరసన తెలియజేశారు.

ఉద్యానశాఖ పథకాలపై అవగాహనేది..?

మండల సమావేశంలో అధికారి తీరుపై సభ్యుల నిరసన

మదనపల్లె రూరల్‌, ఫిబ్రవరి 6: ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అందుతు న్న పథకాలు, రుణాలపై ఉద్యాన అధికారి ఈశ్వర ప్రసాద్‌ మండల సమావేశంలో మాట్లాడుతుండగా మాలేపాడు సర్పంచు గణేష్‌, పోత బోలు సర్పంచు ఈశ్వరయ్యలు నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఉద్యానశాఖలో అందిస్తున్న పథకాలు, రాయితీ రుణాల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రెడ్డె మ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దారు శ్రీనివాసులు మాట్లాడుతున్న సమయం లో సర్పంచు గణేష్‌ తమ గ్రామంలో రీసర్వే గందరగోళంలో ఉంద న్నారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా, జడ్పీటీసీ ఉదయ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తట్టిశ్రీనివాసులరెడ్డి, ఆర్బీకే చైర్మన కత్తిరాజా, ఎంపీడీ వో తాజ్‌మస్రూర్‌, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

రామసముద్రంలో: ఎరువులు, విత్తనాల విక్రయాల్లో కొంత మంది డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని సింగిల్‌విండో అధ్యక్షుడు కేశవరెడ్డి ధ్వజమెత్తారు. అనవసరంగా మందులు ఇస్తూ రైతులను దోచుకుంటున్నారన్నారు.మండల ప్రజా పరిషత కార్యాలయంలో ఎం పీపీ కుసుమకుమారి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:30:09+05:30 IST