బాల్యవివాహాలు అరికట్టడంలో అంగన్వాడీలు కీలకంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2023-01-25T00:12:14+05:30 IST

బాల్య వివాహాలను అరికట్టడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్‌ విజయరామరాజు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో బేటీ బచావో-బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు జిల్లా మహిళా, శిశు సాధికారిత వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

బాల్యవివాహాలు అరికట్టడంలో అంగన్వాడీలు కీలకంగా వ్యవహరించాలి
బాలికలకు బహుమతులు అందజేస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ విజయరామరాజు

కడప(కలెక్టరేట్‌), జనవరి 24: బాల్య వివాహాలను అరికట్టడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్‌ విజయరామరాజు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో బేటీ బచావో-బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు జిల్లా మహిళా, శిశు సాధికారిత వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థ 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని... అప్పుడే వారి శారీరక, మానసిక అభివృద్ధి దోహదపడి వారు విద్యనభ్యసించుటలో పురోగతి సాధిస్తార న్నారు. బాల్యవివాహాలు అరికట్టడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలకమన్నారు. పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా ఒక్కటేనని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు లక్ష్మీదేవి మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్‌ అధికారిణి ఎంఎన్‌రాణి, ఎస్‌ఎ్‌సఏ ప్రోగ్రాం అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి.. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయరామరాజు విద్యాశాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సభాభవనంలో మనబడి నాడు-నేడు పేస్‌-2 పనుల పురోగతిపై విద్యాశాఖ, ఎగ్జిక్యూటవ్‌ ఏజెన్సీ ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ మీనాలతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్ధుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు సిలబస్‌ పూర్తి చేసి రివిజన్‌ కూడా చేపట్టేలా విద్యాశాఖాధికారులు చొరవ చూపాలన్నారు. వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి చెప్పలి దేవరాజు, సమగ్రశిక్ష పీడీ ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాసుల రెడ్డి, ఈఈ కరుణాకర్‌ రెడ్డి, ఏఈ చంద్రశేఖర్‌రెడ్డి, మండలస్థాయి ఇంజనీర్లు, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:12:15+05:30 IST