ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన

ABN , First Publish Date - 2023-01-24T23:38:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవే టీకరణ విధానాలను అడ్డుకుని విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని రాజంపేట సబ్‌ సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సీపీఐ, సీఐటీయూ నేతలు నిరశన దీక్షలు నిర్వహించారు

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన

రాజంపేట, జనవరి 24: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవే టీకరణ విధానాలను అడ్డుకుని విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని రాజంపేట సబ్‌ సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సీపీఐ, సీఐటీయూ నేతలు నిరశన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణలో భాగంగా ఈ నెల 27న విశాఖలో జరిగే కార్మిక మహాగర్జనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీ ఎం కార్యదర్శి రవికుమార్‌, టీడీపీ నాయకులు రమణ, అబుబకర్‌, ఏఐటీయూసీ జి ల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు ఎం.ఎస్‌.రాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:38:29+05:30 IST