అధార్‌ను తప్పక ఆప్డేట్‌ చేయించుకోవాలి

ABN , First Publish Date - 2023-02-06T23:41:02+05:30 IST

ప్రభుత్వ సూచనల మేరకు 2010 నుంచి 2016 మధ్య కాలంలో ఆధార్‌కార్డు పొంది న వారందరూ తమ ఆధార్‌ కార్డులను ఆప్డేట్‌ చేయించుకోవాలని జడ్పీ సీఈవో మన్నూరు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

అధార్‌ను తప్పక ఆప్డేట్‌ చేయించుకోవాలి

జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి

కడప(రూరల్‌) ఫిబ్రవరి 6: ప్రభుత్వ సూచనల మేరకు 2010 నుంచి 2016 మధ్య కాలంలో ఆధార్‌కార్డు పొంది న వారందరూ తమ ఆధార్‌ కార్డులను ఆప్డేట్‌ చేయించుకోవాలని జడ్పీ సీఈవో మన్నూరు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు ఆధార్‌ ఆప్డేట్‌కు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈమేరకు ప్రతి మండలంలో 1, 2 ప్రత్యేక ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఐదేళ్లు పూర్తి అయిన చిన్నపిల్లలు, 15 సంవత్సరాలు దాటిన విద్యార్ధులు డెమోగ్రా్‌ఫను ఆప్డేట్‌ చేయించుకోవాలన్నారు. అలాగే వారి అధార్‌ కార్డుకు మొబైల్‌ ఫోన్‌ లింక్‌, నేమ్‌ కరెక్షన, అడ్రస్‌ మార్పు తదితర వాటిని చేయించుకోవచ్చన్నారు. వివిధ సంక్షేమ పఽథకాలు, బ్యాంకు సేవలు పొందడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విధిగా ఆధార్‌ను ఆప్డేట్‌ చేయించుకోవాలని సూచించారు.

Updated Date - 2023-02-06T23:41:07+05:30 IST