మత సామరస్యానికి ప్రతీకగా

ABN , First Publish Date - 2023-02-06T23:05:18+05:30 IST

మత సామరస్యానికి ప్రతీకగా మదనపల్లె నుంచి టీటీడీ అన్నదాన ట్రస్టుకు స్థానిక కూరగాయల మార్కెట్‌లోని దాదాపీర్‌, ఖాజా అనే వ్యాపారులు ఎనిమిది టన్నుల కూరగాయలు సోమవారం తిరుమలకు తరలించారు.

మత సామరస్యానికి ప్రతీకగా
తిరుమలకు లారీలో తీసుకెళుతున్న కూరగాయలు

టీటీడీకి 8 టన్నుల కూరగాయలు తరలింపు

మదనపల్లె అర్బన్‌, ఫిబ్రవరి 6: మత సామరస్యానికి ప్రతీకగా మదనపల్లె నుంచి టీటీడీ అన్నదాన ట్రస్టుకు స్థానిక కూరగాయల మార్కెట్‌లోని దాదాపీర్‌, ఖాజా అనే వ్యాపారులు ఎనిమిది టన్నుల కూరగాయలు సోమవారం తిరుమలకు తరలించారు. ఈ వాహనాన్ని టూటౌన్‌ సీఐ మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మానవత్వానికి మించిన మతం లేదని అన్నారు. దాదాపీర్‌ మాట్లాడుతూ ప్రతిఏటా తిరుమల అన్నదాన ట్రస్టుకు రెండు మూడుసార్లు కూరగాయలు ఉచితంగా వితరణ చేస్తామన్నారు. భక్తిభావంతో ఈ కార్యక్రమం చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐ రామాంజనేయులు, మండీ యాజమానులు మున్నా, రెడ్డిరామ్‌, చందన్‌, బోరుగుల మాము, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:05:19+05:30 IST