వేధింపులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-02-01T23:20:40+05:30 IST

రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉమ్మ సల్మా అనే వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై ఆమె భర్తతో పాటు మరో ఆరుగురిపై వేధింపుల కేసు నమోదు అయింది.

వేధింపులపై కేసు నమోదు

ప్రొద్దుటూరు క్రైం, ఫిబ్రవరి 1 : రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉమ్మ సల్మా అనే వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై ఆమె భర్తతో పాటు మరో ఆరుగురిపై వేధింపుల కేసు నమోదు అయింది. ఎస్‌ఐ రెడ్డి సురేష్‌ వివరాల మేరకు స్థానిక డీసీఎస్‌ఆర్‌ కాలనీలో నివాసం ఉండే మస్తానయ్య, కుటుంబసభ్యులు కలిసి తనను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తీవ్రంగా కొట్టారంటూ ఉమ్మ సల్మా రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రెడ్డి సురేష్‌ తెలిపారు.

Updated Date - 2023-02-01T23:20:56+05:30 IST