రోడ్లు వేయకపోతే ఓడిపోతాం

ABN , First Publish Date - 2023-01-26T04:07:28+05:30 IST

‘రోడ్లు అధ్వానంగా ఉన్నా యి. వెంటనే రహదారుల నిర్మాణం చేపట్టి పూర్తిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాం’’ అని అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ వైసీపీ నేతలు తేల్చి చెప్పారు.

రోడ్లు వేయకపోతే ఓడిపోతాం

వైవీ సుబ్బారెడ్డి ఎదుట చోడవరం నేతలు

చోడవరం(అనకాపల్లి జిల్లా), జనవరి 25: ‘‘రోడ్లు అధ్వానంగా ఉన్నా యి. వెంటనే రహదారుల నిర్మాణం చేపట్టి పూర్తిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాం’’ అని అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. బుధవారం నియోజకవర్గ ముఖ్య నాయకులు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లతో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానంగా రహదారుల దుస్థితిపై మాట్లాడారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి సరిగా లేదని, సంక్షేమ పథకాలు ఇస్తున్నా ప్రజలకు రోడ్లపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని నాయకులు తెలిపారు.

Updated Date - 2023-01-26T04:07:28+05:30 IST