‘సాగు’లో అధికలోడునూ భర్తిస్తాం

ABN , First Publish Date - 2023-02-07T03:41:59+05:30 IST

వ్యవసాయానికి రైతాంగం వాడే అధికలోడునూ క్రమబద్ధీకరిస్తామని, నెలవారీ బిల్లులో చెల్లిస్తామని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లు స్పష్టం చేశాయి. ‘రైతులకు మీటరు కష్టాలు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి డిస్కమ్‌లు ఈ వివరణ ఇచ్చాయి.

‘సాగు’లో అధికలోడునూ భర్తిస్తాం

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై డిస్కమ్‌ల స్పందన

అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి రైతాంగం వాడే అధికలోడునూ క్రమబద్ధీకరిస్తామని, నెలవారీ బిల్లులో చెల్లిస్తామని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లు స్పష్టం చేశాయి. ‘రైతులకు మీటరు కష్టాలు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి డిస్కమ్‌లు ఈ వివరణ ఇచ్చాయి. వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లను ఏర్పాటు చేసి రైతుల పేరిట డిస్కమ్‌లు జీరో బ్యాలెన్స్‌తో వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు తెరిచాయి. నెలవారీ బిల్లును ముందుగానే ప్రభుత్వం రైతు ఖాతాలో వేస్తుందని చెబుతున్న డిస్కమ్‌లు, రైతుల ఖాతాను నిర్వహించేందుకు మినిమమ్‌ బ్యాలెన్స్‌ను ఉంచడంపై మాత్రం వివరణ ఇవ్వలేదు. జీరో బ్యాలెన్స్‌తోనే ఖాతాలు కొనసాగుతాయన్న హామీనీ ఇవ్వడం లేదు.

Updated Date - 2023-02-07T03:41:59+05:30 IST