ఓటు హక్కును వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2023-01-26T01:35:08+05:30 IST

ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ కోరారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి
అంబేద్కర్‌ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు, అధికారులు

కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌

బాపట్ల, జనవరి 25: ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ కోరారు. 13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలో విద్యార్ధులు, అధికారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్‌ హైస్కూల్‌ వద్ద ప్రదర్శనను కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. పురవీధులలో ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌ సర్కిల్‌లో మానహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. కుల,మత రాజకీయాలకు అతీతంగా ఓటుహక్కును వినియోగించుకొని మంచి పాలకులను ఎన్నుకోవాలన్నారు. ఎన్నికలు జరిగే రోజు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే పాలకులను ప్రశ్నించే హక్కు ఉండదన్నారు. ఎన్నికలు జరిగే రోజు కష్టం అనుకోకుండా పోలింగ్‌బూత్‌కు వెళ్ళి ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల గుర్తింపుకార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎక్కువ సార్లు ఓటుహక్కును వినియోగించుకున్న సీనియర్‌ సిటిజన్లను సన్మానించారు. కొత్తగా ఓటుహక్కు పొందిన వారికి ఇపికే కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.లక్ష్మీశివజ్యోతి, ఎన్నికల సూపరింటెండెంట్‌ సుశీల,మున్సిపల్‌ కమీషనర్‌ ఎ.భానుప్రతాప్‌, మున్సిపల్‌ డీఈ కె.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:35:15+05:30 IST