విదేశీ విద్యను దూరం చేసిన జగన ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-02-09T00:47:36+05:30 IST

పేద విద్యార్థు లకు విదేశి విద్యను జగన సర్కార్‌ దూరం చేసిందని టీడీపీ నియోజకవర్గ ఇన చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు.

 విదేశీ విద్యను దూరం చేసిన జగన ప్రభుత్వం

కలెక్టర్‌కి వినతి పత్రం అందజేస్తున్న డాక్టర్‌ అరవిందబాబు తదితరులు

నరసరావుపేట టౌన, ఫిబ్రవరి 8 : పేద విద్యార్థు లకు విదేశి విద్యను జగన సర్కార్‌ దూరం చేసిందని టీడీపీ నియోజకవర్గ ఇన చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. బుధవారం పట్టణంలో గడి యార స్థంభం వద్ద ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వి గ్రహం వద్ద టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటికి వినతిపత్రం అందజేశారు. డాక్టర్‌ అరవిందబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని 4923 మంది విదేశాల్లో చదువుకునేందుకు రూ.10 లక్షలు చొప్పున రూ.364 కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు. తర్వాత వాటిని రూ.15 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత జగనరెడ్డి చేపట్టిన పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో రూ.20 లక్షలు విదేశీ విద్య అందిస్తా మని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ పథకాలను నిలిపివేశారని తెలిపారు. మూడున్నర సంవత్సరాల తర్వాత 233 మందికి విదేశీ విద్యను మంజూరు చేస్తున్నట్లు భారీ ప్రకటనలు ఇచ్చారని అన్నారు. జగనరెడ్డి అంబేద్కర్‌ పేరున తీసి నిసిగ్గుగా తనపేరు పెట్టుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సాతులూరి కుమార్‌, చింతిరాల బాలు, పెరికల రాయప్ప, గిద్దల వెంకటయ్యర్లు, కొండేపోగు సునీల్‌, గన్నెపూడి నాయుడు, మల్లవరపు శ్యామ్‌, ఇస్తాల బాలస్వామి, మాజీ ఎంపీపీ మొండితోక రామారావు, మాతంగా బంగారం, జక్కుల దుర్గరావు, అగస్టీన, రాజు, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-09T00:47:40+05:30 IST