పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2023-01-26T01:35:49+05:30 IST

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐదు రోజుల పని దినాన్ని అమలు చేయడంతో పాటు, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ బాషా డిమాండ్‌ చేశారు.

 పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి
నగరంపాలెం ఎస్‌బీఐ ప్రధాన వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

గుంటూరు(తూర్పు), జనవరి25: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐదు రోజుల పని దినాన్ని అమలు చేయడంతో పాటు, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ బాషా డిమాండ్‌ చేశారు. ఈమేరకు నగరంపాలెం ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల్లోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, ఈ ఏడాది ప్రారంభం నుంచి జరగనున్న వేతన సవరణపై వెంటనే చర్చలు ప్రారంభించాలన్నారు. ఎస్‌బీఐ నాయకులు జయకుమార్‌ మాట్లాడుతూ బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలన్నారు. ఈనెల 30, 31 తేదీల్లో బ్యాంకుల సమ్మెకు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నేతలు బాషా, వేణు, రవిచంద్రారెడ్డి, మురళీ, పావని, శివ, ప్రభు కిషోర్‌, ప్రేమ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:35:49+05:30 IST