గణతంత్ర వేడుకలకు ముస్తాబు

ABN , First Publish Date - 2023-01-25T00:35:47+05:30 IST

గణతంత్ర దినోత్సవానికి పోలీసుపెరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబైంది.

గణతంత్ర వేడుకలకు ముస్తాబు
పోలీసుకవాతును పరిశీలిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసు కవాతు రిహార్సల్స్‌

బాపట్ల, జనవరి 24: గణతంత్ర దినోత్సవానికి పోలీసుపెరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబైంది. మంగళవారం పోలీసులు కవాతు రిహార్సల్స్‌ నిర్వహించగా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పరిశీలించారు. అడ్మిన్‌ ఆర్‌ఐ మన్మధరావు పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరిస్తూ రిహార్సల్స్‌ను నిర్వహించారు. వేడుకలకు పటిష్ఠమైన భద్రదా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ పి.మహేష్‌, డీఎస్పీలు ఎం.డి.హెచ్‌ ప్రేమ్‌కుమార్‌, ఎ.శ్రీనివాసరావు, ఆర్‌ఐ బి.శ్రీకాంత్‌నాయక్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌, సీఐలు పి.కృష్ణయ్య, వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేటలో..

నరసరావుపేట, జనవరి 24: పల్నాడు జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా జరగనున్న గణతంత్ర వేడుకలకు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం ముస్తాబైంది. మంగళవారం పోలీసు కవాతు రిహార్సల్స్‌ నిర్వహించారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి రిహార్సల్స్‌ను పరిశీలించారు. ఏఆర్‌ ఎస్పీ రామచంద్రరాజు, ఏఆర్‌ డీఎస్పీ చిన్నికృష్ణ పర్యవేక్షణలో పోలీసులు రిహార్సల్స్‌ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జీ బిందుమాధవ్‌, పరేడ్‌ కమాండర్‌ ఆర్‌ఐ వెంకటరమణ, డీఎస్పీ విజయభాస్కర్‌ తదతరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:35:47+05:30 IST