సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు

ABN , First Publish Date - 2023-02-02T01:25:55+05:30 IST

మిరప పైరును సాగు చేస్తున్న రైతులు తగిన సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించ వచ్చని జాతీయ ఉద్యాన పరిశోదన శాస్త్రవేత్త హత్య సింగ్‌ తెలిపారు.

సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు
గుత్తికొండ గ్రామంలో మిర్చి పైరును పరిశీలిస్తున్న ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు

జాతీయ ఉద్యాన పరిశోదన శాస్త్రవేత్త హత్య సింగ్‌

పిడుగురాళ్ళ, ఫిబ్రవరి 1 : మిరప పైరును సాగు చేస్తున్న రైతులు తగిన సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించ వచ్చని జాతీయ ఉద్యాన పరిశోదన శాస్త్రవేత్త హత్య సింగ్‌ తెలిపారు. బుధవారం మండలంలోని గుత్తికొండ గ్రామంలో మిరప సాగు చేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించి అధిక దిగుబడులు సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. మిరప పైరుకి వచ్చే తెగుళ్ళను ఎప్పటికప్పుడు గుర్తించి నివారణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించేందుకు వీలు పడుతుందన్నారు. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో ఎస్సీ, ఎస్టీ రైతులకే కాకుండా చిన్న సన్న కారు రైతులకు మిరప విత్తనాలను అందించటం జరుగుతుందని ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్‌ నరేష్‌ తెలిపారు. వ్యవసాయ సూచనలతో మిరప సాగు చేస్తున్న రైతులు అధిక దిగుబడులు సాధించ వచ్చన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉద్యాన శాఖ అధికారి బీజే బెన్ని, ఉద్యా శాఖ అధికారులు మోహన్‌, శ్రీనివాస్‌, సురేష్‌, కిషోర్‌ కుమార్‌, శ్రీనిత్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T01:26:03+05:30 IST