గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2023-02-07T01:12:20+05:30 IST

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు

గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

కొల్లిపర,ఫిబ్రవరి6: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని తూములూరు సుగాలికాలనీలో తెలుగురైతు రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వంగాసాంబిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధిని శూన్యమేనన్నారు. ఇసుక, సిమెంట్‌, ఇనుము ధరలు విపరీతంగా పెరగటంతో పేదప్రజలు గృహానిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నట్లు తెలిపారు. సంక్షేమ పాలన సాగిస్తున్నామని చెబుతున్న జగన్‌ అన్ని విధాల ధరలు పెంచి పేదవాడిని కూడా దోచుకుంటున్నాడని ఆరోపించారు. రైతుల పంటలకు తగిన దర లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి టీడీపీకీ పట్టం కట్టాలన్నారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు భీమవరపు చినకోటిరెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి కంచర్ల అమృతరాజు, టీడీపీ నాయకులు ఆళ్ళ వీరారెడ్డి, చాగంటి నారాయణరెడ్డి, కొల్లి కోటిరెడ్డి

Updated Date - 2023-02-07T01:12:25+05:30 IST