సీఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2023-01-25T00:49:21+05:30 IST

ఓ వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు ఈ నెల 27వ తేదీన పొన్నూరుకి వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు మంగళవారం అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

సీఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

కల్యాణ మండపాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

పొన్నూరుటౌన్‌, జనవరి 24 : ఓ వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు ఈ నెల 27వ తేదీన పొన్నూరుకి వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు మంగళవారం అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నల్లమోతు రూత్‌రాణి కుమారుడు వివాహం ఈనెల 27వ తేదీన పట్టణంలోని పరంథయ్య కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్‌ స్థలాన్ని కలెక్టర్‌ ఎం.వేణగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, డీఎస్పీ స్రవంతిరాయ్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరంథయ్య కన్వెన్షన్‌ సెంటర్‌లో హెలిప్యాడ్‌ కోసం స్థలాన్ని సైతం పరిశీలించారు.

Updated Date - 2023-01-25T00:49:21+05:30 IST