నేడు ఎన్నికల సాధన అవార్డులు ప్రదానం

ABN , First Publish Date - 2023-01-25T04:18:20+05:30 IST

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఓటర్ల నమోదుతోపాటు ఎన్నికల ప్రక్రియలో ఉత్తమ పద్ధతులను(ఉత్తమ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌) కనబరిచిన అధికారులకు రాష్ట్రస్థాయిలో(ఉత్తమ ఎన్నికల సాధన అవార్డులు-2022) అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముకే్‌షకుమార్‌ మీనా తెలిపారు.

నేడు ఎన్నికల సాధన అవార్డులు ప్రదానం

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఓటర్ల నమోదుతోపాటు ఎన్నికల ప్రక్రియలో ఉత్తమ పద్ధతులను(ఉత్తమ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌) కనబరిచిన అధికారులకు రాష్ట్రస్థాయిలో(ఉత్తమ ఎన్నికల సాధన అవార్డులు-2022) అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముకే్‌షకుమార్‌ మీనా తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఉత్త మ జిల్లా ఎలక్టోరల్‌ ఆఫీసర్లుగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణ, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, పశ్చిమ గోదావరి కలెక్టర్‌ పి.ప్రశాంతి ఎంపికయ్యారు. వీరితోపాటు మరో 44 మంది జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, బీఎల్‌వోలను ఎంపిక చేశారు.

Updated Date - 2023-01-25T04:18:20+05:30 IST