మరో 1,000 కోట్ల అప్పు

ABN , First Publish Date - 2023-01-25T04:32:04+05:30 IST

జగన్‌ సర్కారు కొత్తగా ఇంకో రూ.1000 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం తరపున సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తెచ్చారు. దీనితో కలుపుకొంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ - జనవరి వరకు 10 నెలల్లో తెచ్చిన అప్పు రూ.80,300 కోట్లకు చేరింది.

మరో 1,000 కోట్ల అప్పు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు కొత్తగా ఇంకో రూ.1000 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం తరపున సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తెచ్చారు. దీనితో కలుపుకొంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ - జనవరి వరకు 10 నెలల్లో తెచ్చిన అప్పు రూ.80,300 కోట్లకు చేరింది. పెండింగ్‌ బిల్లులు రూ.35,000 కోట్లున్నాయి. ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ నుంచి మూడు రోజుల క్రితం తెచ్చిన రూ. 5వేల కోట్లు; మారిటైమ్‌ బోర్డు ద్వారా తెచ్చిన రూ.2,700 కోట్ల అప్పు, నేరుగా తెచ్చిన అప్పు రూ.72,600 కోట్లలో రూ.48,300 కోట్లు ఆర్‌బీఐలో సెక్యూరిటీలు వేలం ద్వారా; రూ.8,300కోట్లు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా; రూ.12,000కోట్లు ఇతర కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి; రూ.4,000 కోట్లు ఈఏపీ అప్పు లు ఉన్నాయి.

Updated Date - 2023-01-25T04:32:04+05:30 IST