16మంది ఖైదీలకు రేపు విముక్తి

ABN , First Publish Date - 2023-01-25T04:07:35+05:30 IST

రాష్ట్ర జైళ్లలో మగ్గుతున్న పదహారు మంది ఖైదీలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విముక్తి లభిస్తోంది.

16మంది ఖైదీలకు రేపు విముక్తి

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి) రాష్ట్ర జైళ్లలో మగ్గుతున్న పదహారు మంది ఖైదీలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విముక్తి లభిస్తోంది. ‘ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా.. చిన్న నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్షలు మినహా చిన్న నేరాలకు పాల్పడిన ఖైదీల్లో 66శాతం శిక్ష పూర్తి చేసుకున్న వారికి విముక్తి కల్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర హోం, జైళ్ల శాఖ అధికారులు పేర్లు పరిశీలించిన తర్వాత 19మంది అర్హులుగా తేలారు. వారిలో ముగ్గురు ఇప్పటికే విడుదల కాగా మిగిలిన 16మందికి జనవరి 26న విముక్తి లభించబోతోంది.

Updated Date - 2023-01-25T04:07:35+05:30 IST