గురువులకు గిఫ్ట్‌ల గేలం!

ABN , First Publish Date - 2023-02-07T04:02:12+05:30 IST

రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గిఫ్ట్‌ల రాజకీయం మొదలుపెట్టింది.

గురువులకు గిఫ్ట్‌ల గేలం!

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి లంచ్‌ బాక్సుల పంపిణీ

వైసీపీ మద్దతు అభ్యర్థి రామచంద్రారెడ్డి అత్యుత్సాహం

అనంతపురం విద్య, ఫిబ్రవరి 6: రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గిఫ్ట్‌ల రాజకీయం మొదలుపెట్టింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యా య ఎమ్మెల్సీ అభ్యర్థి, వైసీపీ మద్దతుదారు రామచంద్రారెడ్డి తరఫున అనంతపురం జిల్లా వ్యాప్తంగా గిఫ్ట్‌ బాక్సులు పంపిణీ చేపట్టారు. కొందరు యువకులు అనంతపురం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉద యం 9 గంటల నుంచి 11.30 గంటల మధ్య రామచంద్రారెడ్డి పేరుతో ఉన్న కరపత్రాలు, టిఫిన్‌ బాక్సులు పంపిణీ చేశా రు. పలువురు ఉపాధ్యాయులకు గిఫ్ట్‌ బా క్సులను ఇచ్చారు. కంబదూరు మండలంలోని ఓ స్కూల్‌కు ఇద్దరు యువకులు గిఫ్ట్‌ బాక్సులు పంపిణీకి ప్రయత్నించగా అక్కడి ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎలా కనబడుతున్నాం..? లంచ్‌ బాక్సుల కోసం ఓట్లు అమ్ముకునే వాళ్ల మాదిరి కనిపిస్తున్నామా?’ అని మండిపడ్డారు. దీంతో యువకులు స్కూల్‌ లంచ్‌ బాక్సులు స్కూలు ఆవరణలో పెట్టేసి వెళ్లిపోయారు. కాగా, ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా రాకముందే తాయిలాల పంపిణీ మొదలుకావడంతో సదరు అభ్యర్థి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, పాఠశాలల్లో పంపిణీ చేసిన గిఫ్ట్‌ బాక్సుల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాలు అప్రమత్తమయ్యాయి. అనంతపురం జిల్లాలో వైసీపీ మద్దతు టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫును గిఫ్ట్‌ బాక్సుల పంపిణీ వెనుక కడప గ్యాంగ్‌ల హస్తం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.

మా నాయకుడి ఆదేశాల మేరకే పోటీ!: సినీ నటుడు అలీ

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 6: ‘మా నాయకుడు ఎక్కడి నుంచి పోటీచేయమని ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తా’.. అని సినీ హాస్యనటుడు, ప్రభుత్వ ఎలక్ర్టానిక్‌ మీడియా సలహాదారు అలీ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated Date - 2023-02-07T04:02:12+05:30 IST