ఆప్కో చైర్మన్‌గా గంజి చిరంజీవి

ABN , First Publish Date - 2023-01-25T04:11:57+05:30 IST

వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మంగళగిరి మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ గంజి చిరంజీవిని ఆప్కో చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఆప్కో చైర్మన్‌గా గంజి చిరంజీవి

మంగళగిరి సిటీ, జనవరి 24: వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మంగళగిరి మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ గంజి చిరంజీవిని ఆప్కో చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది ఆగస్టులో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన చిరంజీవికి అధిష్టానం ఆ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఆప్కో చైర్మన్‌గా కొనసాగిన చిల్లపల్లి మోహన్‌రావు పదవీకాలం గతేడాది డిసెంబరుతో ముగిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా చిరంజీవి బుధవారం నియామక ఉత్తర్వులు అందుకోనున్నారు.

Updated Date - 2023-01-25T04:11:57+05:30 IST