Minister Merugaపై సోషల్ మీడియాలో వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-02-06T08:29:41+05:30 IST

మంత్రి మేరుగ నాగార్జునపై మాజీ సర్పంచి భర్త ఆరోపణలు గుప్పించారు. కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లించనివ్వకుండా నాగార్జున అడ్డుపడుతున్నారని.. దళితులను వేధిస్తున్నారంటూ ముల్పూరు మాజీ సర్పంచ్ భర్త మాణిక్య రావు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Minister Merugaపై సోషల్ మీడియాలో వీడియో వైరల్

బాపట్ల : మంత్రి మేరుగ నాగార్జున (Meruga Nagarjuna)పై మాజీ సర్పంచి భర్త ఆరోపణలు గుప్పించారు. కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లించనివ్వకుండా నాగార్జున అడ్డుపడుతున్నారని.. దళితులను వేధిస్తున్నారంటూ ముల్పూరు మాజీ సర్పంచ్ భర్త మాణిక్య రావు ఓ వీడియోను సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేశారు. అగ్రవర్ణాల చేతిలో మంత్రి కీలు బొమ్మగా మారాడని వీడియో (Video)లో ఆరోపించారు. తన భార్య సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామంలో రోడ్లు వేశామని.. ఆ రోడ్లకు సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి నాగార్జున అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అప్పుల బాధతో మానసికంగా కుంగిపోయి వీడియో చేసినట్లు మాణిక్యరావు వెల్లడించారు.

Updated Date - 2023-02-06T08:49:02+05:30 IST