ఓటరు మహాశయులారా..

ABN , First Publish Date - 2023-01-25T01:31:46+05:30 IST

మనది కొత్త తూర్పుగోదావరి జిల్లా. ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఓటర్ల విభజన కూడా జరిగింది.

ఓటరు  మహాశయులారా..

మన జిల్లా మొత్తం ఓటర్లు 15,52,268

పురుషులు 7,61,026 మంది

మహిళలు 7,91,128

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

రాజమహేంద్రవరం కళాకేంద్రంలో కలెక్టర్‌ అధ్యక్షతన కార్యక్రమం

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 24: మనది కొత్త తూర్పుగోదావరి జిల్లా. ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఓటర్ల విభజన కూడా జరిగింది. ఇటీవల మార్పులు, చేర్పులకూ అవకాశం ఇచ్చారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిఽధిలో ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాలను కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత వెల్లడించా రు. ఆ ప్రకారం జిల్లాలో మొత్తం 15,52,268 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 7,61,026 మంది, మహిళలు 7,91,128 మంది ఉన్నారు. ఇతరులు 114 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 18-19 ఏళ్ల మధ్య వయస్కులు 13,957 మంది ఉన్నారు. ఇక నియోజకవ ర్గాల వారీగా ఓటర్ల వివరాలు చూస్తే.. అనపరి నియోజకవర్గంలో పురుషులు 1,06,168, మహిళలు 1,09, 558 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 228 పోలింగ్‌ కేంద్రాలు, మొత్తం ఓటర్లు 2,15,726. అలాగే రాజానగరం నియోజకవర్గంలో పురుషులు 1,02,239 మంది, మహిళలు 1,04,187 మంది, ఇతరు లు 9 మంది ఉండగా మొత్తం ఓటర్లు 2,06,435. ఇక్క డ పోలింగ్‌ కేంద్రాలు 216 ఉన్నాయి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పురుషులు 1,23,533 మంది, మహిళలు 1,31,716, ఇతరులు 62 మంది ఉండగా మొత్తం ఓటర్లు 2,55,311 మంది. పోలింగ్‌ కేంద్రాలు 225. రాజమహేంద్రవరం రూరల్‌లో పురుషులు 1,25,942, మహిళలు 1,31,469 మంది, ఇతరు లు 16 మంది, మొత్తం 2,57,427 మంది ఓటర్లు. పో లింగ్‌ కేంద్రాలు 263. కొవ్వూరు నియోజకవర్గంలో పురుషులు 86,463, మహిళలు 90,855, ఇతరులు 9 మంది.. మొత్తం 177327 మంది. పోలింగ్‌ కేంద్రాలు 174. నిడదవోలు నియోజకవర్గంలో పురుషులు 1,01, 213, మహిళలు 1,04,964, ఇతరులు 8 మంది.. మొ త్తం 206185 మంది. పోలింగ్‌ కేంద్రాలు 205. గోపాలపురం నియోజకవర్గంలో పురుషులు 1,15,468, మహిళలు 1,18,379, ఇతరులు 10 మంది.. మొత్తం 2,33, 857 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాలు 248. కాగా బుధవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తు న్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2023-01-25T01:31:46+05:30 IST