రైతు భరోసా కేంద్రాలపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2023-01-25T00:39:42+05:30 IST

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో ఆర్‌బీకేలను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు తనిఖీ చేశారు.

 రైతు భరోసా కేంద్రాలపై విజిలెన్స్‌ దాడులు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 24: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో ఆర్‌బీకేలను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎస్‌బి బాగ్చి ఆదేశాల మేరకు ఎస్పీ రవికుమార్‌ ఆధ్వర్యంలో విజిలెన్స్‌ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి కాకినాడ జిల్లాలో గండేపల్లి మండలంలో ఉప్పలపాడు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుడిపాలెం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.ఈ తనిఖీల్లో డీఎస్పీ ముత్యాల నాయుడు, కార్యాలయం ఇన్‌స్పెక్టర్లు సత్యకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఏవో భార్గవ మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:39:42+05:30 IST