తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ

ABN , First Publish Date - 2023-05-27T01:05:53+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ఆదరణ పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. మహానాడు సందర్భంగా కాకినాడ విచ్చేసిన ఆయనను ఓ హోటల్‌లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌ మహానాడు కార్యక్రమాలపై కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ
జ్ఞానేశ్వర్‌ను శాలువాతో సత్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కొండబాబు

పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌

కాకినాడ సిటీ, మే 26: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ఆదరణ పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. మహానాడు సందర్భంగా కాకినాడ విచ్చేసిన ఆయనను ఓ హోటల్‌లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌ మహానాడు కార్యక్రమాలపై కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్‌, నాయకులు అమన్‌జైన్‌, కోదాడ పెద్ద, కేళగి ప్రసాద్‌ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక, మన పార్టీ అఽధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్‌ గణేష్‌బాబు, ఆ పార్టీ వ్యవస్థాపకులైన కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిసి సత్కరించారు. ఉమ్మడి జిల్లా వక్ఫ్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు ఎంఏ తాజుద్దీన్‌, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి గుత్తుల రమణ, కాకినాడ పార్లమెంట్‌ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు దండుప్రోలు నాగబాబు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Updated Date - 2023-05-27T01:05:53+05:30 IST