టీడీపీకి జనాదరణ చూసి వైసీపీకి చెమటలు

ABN , First Publish Date - 2023-01-25T00:44:27+05:30 IST

చంద్రబాబు సభలకు ప్రజలు నుంచి వస్తున్న ఆద రణ చూసి వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు.

టీడీపీకి జనాదరణ చూసి వైసీపీకి చెమటలు
లోకేశ్‌ పాదయాత్ర విజయవంతం కావాలని తంటికొండ వెంకన్న ఆలయంలో పూజలు చేస్తున్న జ్యోతుల నెహ్రూ

గోకవరం, జనవరి 24 : చంద్రబాబు సభలకు ప్రజలు నుంచి వస్తున్న ఆద రణ చూసి వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ గోకవరం ఠాణా సెంటర్‌లో గల దేవి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం 101 కార్లతో నియోజకవర్గం నలు మూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ నడుమ తంటికొండ వెంకన్న ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. తదనంతరం 101 కొబ్బరి కాయలను కొట్టి లోకేశ్‌ పాదయాత్ర విజయవంతం కావాలని వేడుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు యువనేత నారా లోకేశ్‌ 400 రోజులు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేశ్‌ పాదయాత్ర కొనసాగుతుం దన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంగరాతి రాము, అడపా భరత్‌, బదిరెడ్డి అచ్చన్నదొర, బదిరెడ్డి బాబి, ఉంగరాల రాము, మండిగ గంగాధర్‌, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, పోసిన ప్రసాద్‌, కొంగరపు రాజు, పురంశెట్టి శివాజీ, బత్తుల సత్తిబాబు, గెడ్డం బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:44:27+05:30 IST