మూడు నెలలు వరకు పెళ్లిళ్లే..పెళ్లిళ్లు
ABN , First Publish Date - 2023-01-26T00:11:25+05:30 IST
నెలరోజుల తర్వాత వివాహాల సీజన్ మొదలైంది. డిసెంబరు 21తో గత ముహూర్తాలు ముగియగా పుష్యమాసం శూన్యమాసం కారణంగా కొద్ది విరామం అనంతరం బుధవారం రాత్రి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.

అన్నవరం, జనవరి 25: నెలరోజుల తర్వాత వివాహాల సీజన్ మొదలైంది. డిసెంబరు 21తో గత ముహూర్తాలు ముగియగా పుష్యమాసం శూన్యమాసం కారణంగా కొద్ది విరామం అనంతరం బుధవారం రాత్రి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. మళ్లీ వరుసగా మూడునెలలు విరామం లేకుండా వివాహ ముహూర్తాలను పండితులు నిర్ణయించారు. ఉత్తరాయణంలో వివాహాలు చేసుకోవడానికి ఎక్కవగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఈనెలలో 25, 26, 28, 30 తేదీలతో పాటుగా ఫిబ్రవరి నెలలో 20 రోజులు మార్చి నెలలో 20 రోజులు వివాహ ముహూర్తాలున్నాయి. మరొక నెల విరామం అనంతరం తిరిగి ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే రత్నగిరి కొండపై వివాహ బృందాలు కల్యాణ మండపాలను బుకింగ్ చేసుకున్నాయి. అన్నవరం దేవస్థానంలో 24 ఉచిత కల్యాణ మండపాలు విష్ణుసదన్ నందు 36 హాల్స్ వివిధప్రాంతాలలో హాల్స్, సీతారామ, పాత, కొత్త సెంటినరీ కాటేజీలు వద్ద రూములు, రామాలయ ప్రాంగణంలో వివాహాలు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. రెండు నెలల సీజన్లో అన్నవరం కొండపై సుమారు వెయ్యి పెళ్లిళ్లకు పైగా జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.