అమలాపురంలో పందుల మృత్యువాత

ABN , First Publish Date - 2023-01-26T01:42:59+05:30 IST

అమలాపురం పట్టణ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పందులు వరుసగా చనిపోతున్నాయి. దాంతో మున్సిపల్‌ అధికారులు అప్రమత్తమై శానిటేషన్‌ సిబ్బంది అందించిన సమాచారంతో అమ లాపురం పట్టణంలోని 30 నుంచి 40 వరకు పందులు చనిపోయినట్టు గుర్తిం చారు. దాంతో మున్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు జిల్లా పశువైద్యాధి కారుల దృష్టికి సమాచారాన్ని తీసుకువెళ్లారు. జిల్లా పశుసంవర్థకశా

అమలాపురంలో పందుల మృత్యువాత

వైద్యులతో పోస్టుమార్టం.. నివేదిక వచ్చేవరకు విక్రయాలు బంద్‌

అమలాపురం టౌన్‌, జనవరి 25: అమలాపురం పట్టణ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పందులు వరుసగా చనిపోతున్నాయి. దాంతో మున్సిపల్‌ అధికారులు అప్రమత్తమై శానిటేషన్‌ సిబ్బంది అందించిన సమాచారంతో అమ లాపురం పట్టణంలోని 30 నుంచి 40 వరకు పందులు చనిపోయినట్టు గుర్తిం చారు. దాంతో మున్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు జిల్లా పశువైద్యాధి కారుల దృష్టికి సమాచారాన్ని తీసుకువెళ్లారు. జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్‌ ఎ.జైపాల్‌ నేతృత్వంలో జిల్లా పశువ్యాధి నిర్థారణా కేంద్రం నుంచి వచ్చిన డాక్టర్‌ కె.సందీప్‌, డాక్టర్‌ ఎల్‌.విజయారెడ్డిల బృందం చనిపోయిన పందికి బుధ వారం పోస్టుమార్టం నిర్వహించారు. శాంపిల్స్‌ను సేకరించి కాకినాడ పశువ్యాధి నిర్థారణా కేంద్రానికి తీసుకువెళ్లారు. నివేదిక అందేవరకు మార్కెట్‌లో పంది మాంసం విక్రయాలను నిలుపుదల చేసినట్టు డాక్టర్‌ విజయారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-01-26T01:42:59+05:30 IST