పర్యావరణ పరిరక్షణకు లయన్స్‌ ఈ-వేస్ట్‌

ABN , First Publish Date - 2023-01-25T00:42:26+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే లయన్స్‌ క్లబ్‌ ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు ఈ-వేస్ట్‌ పేరుతో కొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్‌ గవర్నర్‌ మాటూరి మంగతాయరు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు లయన్స్‌ ఈ-వేస్ట్‌

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 24: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే లయన్స్‌ క్లబ్‌ ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు ఈ-వేస్ట్‌ పేరుతో కొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్‌ గవర్నర్‌ మాటూరి మంగతాయరు తెలిపారు. గృహాలు, వ్యాపార సముదాయాల్లో కాలపరిమితి తీరిన వస్తువులను ఈనెల 26 నుంచి వచ్చే నెల26వ తేదీ వరకు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరంలో ఈ-వేస్ట్‌ సేరకణ చేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో కంభం సత్రం, కాకినాడలో రామారావు పేట లయన్స్‌ క్లబ్‌ హాలు, అమలాపురం లయన్స్‌ క్లబ్‌ హాలులో ఈ సేకరణ ఉంటుందన్నారు. మంగతాయారు 99595 34303, కొయ్యన కుమారి 93999 02372, ఇందివర శ్యామ్‌ 944017 5539 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - 2023-01-25T00:42:26+05:30 IST