ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-01-26T01:52:22+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ఓట ర్లందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం ఆ

ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్‌
సీనియర్‌ ఓటర్లను సత్కరించిన జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా

అమలాపురం రూరల్‌, జనవరి 25: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ఓట ర్లందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం ఆవిర్భావ దినోత్స వమైన జనవరి 25న ప్రతీ ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. పద్దెని మిదేళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును పొందాలన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటర్ల దినోత్సవంపై నిర్వహించిన ముగ్గుల పోటీల్లో సందేశాత్మకంగా ముగ్గులు వేసిన విద్యార్థులను కలెక్టర్‌ అభినందించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి గుర్తింపుకార్డులు అందించారు. సీనియర్‌ సిటిజన్స్‌ అయిన ఓటర్లను ఆయన సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, మున్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జేవీజీ రామారావు, తహశీల్దార్‌ పరమట శ్రీపల్లవి, ఎంపీడీవో కాశి విజయ్‌ప్రసాద్‌, ఏవో జక్కం వెంకటకృష్ణారావు, సర్పంచ్‌ చొల్లంగి శివాళిని తదితరులు పాల్గొ న్నారు. అనంతరం ఓటర్ల దినోత్సవంపై స్థానికంగా అవగాహనా ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2023-01-26T01:52:22+05:30 IST