అల్లర్ల కేసులు ఎత్తేస్తే పరిస్థితేంటి?

ABN , First Publish Date - 2023-01-26T01:56:23+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ పాలన, వైసీపీ పరిస్థితులపై పరిశీలకులతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల కీలక భేటీ అమరావతిలో ఇటీవల జరిగింది. జిల్లాలోని ప్రధాన సమస్యలతోపాటు పార్టీపరంగా మరింత మైలేజ్‌ సాధించేందుకు చేప ట్టాల్సిన పరిస్థితులపైనా చర్చ సాగింది. అమలాపురం అల్లర్ల ఘటన కేసులు ఎత్తివేసే ప్రతిపాదనలతోపాటు ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డిని బదిలీ చే యాలనే ప్రతిపాదనతోసహా అనేక అంశాలను తెరపైకి వచ్చినట్టు తెలిసింది. అమరావతిలో రెండు రోజుల కిందట ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ పరిశీ లకులైన ఎంపీ మి

అల్లర్ల కేసులు ఎత్తేస్తే పరిస్థితేంటి?

వైసీపీ పరిశీలకుల ఆరా

మంత్రులు, ఎమ్మెల్యేలతో కీలక భేటీ

ప్రభుత్వ పాలన, పార్టీ పరిస్థితులపై చర్చ

ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి బదిలీకి ఒత్తిడి

వాడివేడిగా సమావేశం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వ పాలన, వైసీపీ పరిస్థితులపై పరిశీలకులతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల కీలక భేటీ అమరావతిలో ఇటీవల జరిగింది. జిల్లాలోని ప్రధాన సమస్యలతోపాటు పార్టీపరంగా మరింత మైలేజ్‌ సాధించేందుకు చేప ట్టాల్సిన పరిస్థితులపైనా చర్చ సాగింది. అమలాపురం అల్లర్ల ఘటన కేసులు ఎత్తివేసే ప్రతిపాదనలతోపాటు ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డిని బదిలీ చే యాలనే ప్రతిపాదనతోసహా అనేక అంశాలను తెరపైకి వచ్చినట్టు తెలిసింది. అమరావతిలో రెండు రోజుల కిందట ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ పరిశీ లకులైన ఎంపీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కీలకంగా భేటీ అయినట్టు సమాచారం. ఇటీవల జిల్లాలో వైసీపీ ఒక కీలక సర్వే నిర్వహించింది. వాటిలో ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ పరిస్థితు లపై విస్తుపోయే విషయాలు వెల్లడికావడంతో పార్టీపరంగా నష్ట నివారణా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కార్యాచరణ సిద్ధంచేశారు. దీనిలో భా గంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ పెద్దలతో భేటీ జరిగినట్టు తెలిసింది.

కోనసీమ అల్లర్ల కేసులపై చర్చ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా గత ఏడాదిలో నామకరణం చేసిన సమయంలో అమలాపురం కేంద్రంగా జరిగిన అల్లర్ల ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఇది ప్రధాన సామాజిక వర్గాల మధ్య వైరానికీ దారితీసింది. ఈ ఘటనల్లో విధ్వంసానికి పాల్పడిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా వైసీపీ పెద్దలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే కేసుల ఎత్తివేతపై స్థానికంగా వైసీపీ ప్రజాప్ర తినిధులు హామీ కూడా ఇచ్చారు. ఈ పర్యవసానాలపై ఎమ్మెల్యేలు, పరిశీ లకులు తీవ్రంగా చర్చించినట్టు తెలిసింది. ఈ ఘర్షణల్లో మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ల ఇళ్లకు నిప్పు పెట్టిన విషయం విదితమే. అయితే ఈ కేసుల్లో జిల్లావ్యాప్తంగా రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారి పై కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదుచేసి ఆధారాలతో సంబంధం లేకుండా పోలీసు యంత్రాంగం అరెస్టుల పర్వం కొనసాగించిందనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. గడపగడపకు వెళుతున్న ఎమ్మెల్యేలను ఈ వ్యవహారంపై బాధి తులు నిలదీస్తున్నారు. వైసీపీ వెన్నంటి ఉండే ప్రధాన సామాజికవర్గం పార్టీకి దూరం అవుతున్న నేపథ్యంలో అందరినీ ఆకట్టుకునేందుకు కేసులు ఎత్తివేసే ఆలోచన జగన్‌ ప్రభుత్వం చేస్తుందన్న పరిశీలకుల వ్యాఖ్యలతో ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య వాదోపవాదాలు కూడా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. భిన్న అభిప్రాయాలు వ్యక్తంకావడంతో భేటీ వేడివేడిగా సాగినట్టు తెలిసింది.

ఎస్పీని బదిలీ చేయాలంటూ పట్టు

అమలాపురం అల్లర్ల ఘటన తరువాత కోనసీమ జిల్లాలో నెలకొన్న శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు సమర్థుడైన అధికారిగా పేరొందిన అప్పటి కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్న సుధీర్‌కుమార్‌రెడ్డిని జిల్లా ఎస్పీగా నియమిం చారు. అల్లర్ల కేసులో నిందితుల గుర్తింపులో ఆధారాలతోనే అరెస్టులు చేయ డంతో చాలామంది అమాయకులు కేసుల నుంచి బయట పడగలిగారు. దీనికితోడు జిల్లాలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళనచేసి గాడిన పెట్టారు. ఇటీవల సంక్రాంతి పర్వదినాల్లో గుండాట, పేకాట, రికార్డింగు డ్యాన్సుల వంటి వాటికి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి బ్రేక్‌ వేయడంతో మంత్రులతో సహా ఎమ్మెల్యేలంతా ఆయన వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారు. సంక్రాంతి పర్వదినాల మూడు రోజులపాటు కోడి పందేల నిర్వహణకు అనుమతిచ్చినప్పటికీ గుండాటలు, పేకాటలు, రికార్డింగు డ్యాన్సుల వంటివి జరగకుండా ఎస్పీ అడ్డుకట్ట వేయడం ద్వారా జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధుల ఆధిపత్యానికి బ్రేక్‌ వేసినట్టుయింది. ఇది స్థానికంగా ఆ పార్టీ నేతలకు ఇబ్బందికరంగానూ మారింది. దాంతో ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి వ్యవహారాన్ని ఎంపీలు మిథున్‌రెడ్డి, బోస్‌ల దృష్టికి తీసు కువెళ్లి ఆయన్ను బదిలీ చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనికి సీఎం సహా పార్టీ పెద్దలు సుముఖంగా లేనట్టు సమాచారం. అయితే గుండా టల నిర్వహణకు అనుమతులు సాధిస్తామని ఓ ప్రజాప్రతినిధి నియోజక వర్గంలోని అసాంఘికశక్తుల నుంచి ముందస్తుగానే భారీగా సొమ్ములు వసూ లు చేసినట్టు పార్టీ పరిశీలకుల దృష్టికి కూడా వెళ్లినట్టు తెలిసింది. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై ఈ భేటీలో చర్చింనట్టు సమాచారం. ఎమ్మెల్సీలుగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:56:24+05:30 IST